AP Assembly: ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత.. సర్పంచులపై పోలీసుల లాఠీచార్జ్

Tensions at AP assembly as sarpanches try to siege
  • సమస్యల పరిష్కారం కోసం ‘చలో అసెంబ్లీ’కి పిలుపు
  • ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • సర్పంచులను ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

దారిమళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన సర్పంచులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు.
AP Assembly
Sarpanch
Andhra Pradesh

More Telugu News