MA Sharif: ఓటర్ల తుది జాబితాలో లోపాలపై సీఈవోకు ఫిర్యాదు చేసిన ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్

  • ఇటీవల ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
  • తుది జాబితాలోనూ తప్పులు ఉన్నాయంటున్న టీడీపీ నేతలు
  • తక్షణమే ఓటరు జాబితాలో లోపాలు సరిదిద్దాలన్న ఎంఏ షరీఫ్
  • సీఈవోకు వినతిపత్రం అందజేత 
MA Sharif complains CEO on final voter list mistakes

ఇటీవల ఎన్నికల సంఘం ఏపీలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేయడం తెలిసిందే. అయితే, ఓటర్ల తుది జాబితాలోనూ లోపాలు ఉన్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 

ఓటరు జాబితాలో ఇంకా తప్పులు కనిపిస్తూనే ఉన్నాయని, తక్షణమే ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నెంబర్లు తప్పులున్నాయని వివరించారు. మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించలేదని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. 

"మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లున్నాయి. ఒకే డోర్ నెంబర్లతో వందలాది ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయి.  ఒకే ఓటు వేర్వేరు నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా... స్థానికంగా లేరంటూ వేలాది ఓట్లు తొలగించారు" అంటూ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలు సమర్పించారు. ఓటర్ జాబితా తప్పిదాలపై వార్తా కథనాలను కూడా అందించారు. తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలని, ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కుల్ని కాపాడాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

More Telugu News