మేం ప్రచారం చేసి ఉంటే జగదీశ్ రెడ్డి 70వేల ఓట్ల తేడాతో ఓడిపోయేవాడు: మంత్రి కోమటిరెడ్డి
- నల్గొండలో నైతికంగా తాము 12 సీట్లు గెలిచామన్న కోమటిరెడ్డి
- అవసరం లేకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని విమర్శ
- కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆర్ హయాంలోనే అన్న మంత్రి
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరవు ఛాయలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. మంత్రిగా జగదీశ్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ఏనాడూ రివ్యూ చేయలేదన్నారు. అసలు మేం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు... అప్పుడే ఎవరితోనో కుమ్మక్కు అవుతామా? అని నిలదీశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించింది కేసీఆర్ హయాంలోనే అని పేర్కొన్నారు.