Ravichandran Ashwin: అశ్విన్ ఖాతాలో మరో రికార్డు

  • విశాఖ టెస్టులో 3 వికెట్లు తీసిన అశ్విన్
  • ఇప్పటివరకు ఓవరాల్ గా ఇంగ్లండ్ పై 96 వికెట్లు తీసిన వైనం
  • బీఎస్ చంద్రశేఖర్ 95 వికెట్ల రికార్డు తెరమరుగు
Team India off spinner Ravichandran Ashwin sets new record by 96 wickets against England team

టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశాఖ టెస్టు ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ ఇంగ్లండ్ పై రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో ఇంగ్లండ్ పై అశ్విన్ 96 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఇంగ్లండ్ పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డు పుటల్లో కెక్కాడు. 

గతంలో ఈ రికార్డు స్పిన్ దిగ్గజం బీఎస్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ ఇంగ్లండ్ పై 95 వికెట్లు తీశాడు. ఇప్పుడా రికార్డును అశ్విన్ అధిగమించాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 92, బిషన్ సింగ్ బేడీ 85, కపిల్ దేవ్ 85, ఇషాంత్ శర్మ 67 వికెట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. 

కాగా, అశ్విన్ విశాఖ టెస్టులో తీసిన 3 వికెట్లతో టెస్టుల్లో అతడి మొత్తం వికెట్ల సంఖ్య 499కి చేరింది. మరొక్క వికెట్ పడగొడితే అశ్విన్ 500 వికెట్ల మార్కును అందుకుంటాడు. కెరీర్ లో ఇప్పటివరకు అశ్విన్ 97 టెస్టులు ఆడాడు. వికెట్ల సగటు 23.92 కాగా... 34 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.

More Telugu News