Poonam Pandey: పూనమ్ పాండే కేన్సర్ ప్రచారంపై క్షమాపణలు చెప్పిన ‘సచ్‌బాంగ్’.. ఆమె తల్లి కూడా అలాగే చనిపోయారన్న ఏజెన్సీ

  • గర్భాశయ కేన్సర్‌పై ప్రచారం కోసం చనిపోయినట్టు నమ్మించిన పూనమ్ పాండే
  • అవగాహన ఓకే కానీ ప్రచారం తీరు బాగాలేదంటూ విమర్శలు
  • అందులో తామూ భాగమయ్యామంటూ డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు
Schbang explains its Poonam Pandey publicity stunt campaign

గర్భాశయ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు చనిపోయినట్టు నమ్మిస్తూ బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే చేసిన ప్రచారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె ప్రచారంతో గర్భాశయ కేన్సర్ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఏర్పడిందంటూనే ప్రచార తీరును చాలామంది తప్పుబట్టారు. విమర్శలు వెల్లువెత్తడంతో ప్రచారంలో భాగమైన డిజిటల్ ఏజెన్సీ ‘సచ్‌బాంగ్’ క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటన విడుదల చేసింది.

సర్వైకల్ కేన్సర్ కోసం పూనమ్ చేసిన ప్రచారంలో తామూ భాగమయ్యామని, కాబట్టి దీనిపై తాము క్షమాపణలు చెప్పాలనుకుంటున్నామని పేర్కొంది. పూనమ్ తల్లి కూడా ఇదే కేన్సర్‌తో మృతి చెందిన విషయం చాలామందికి తెలియకపోవచ్చని, పూనమ్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం కారణంగా దానిని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తించి ఇలా ప్రచారం చేయాల్సి వచ్చిందని, దీనివల్ల ఎంతోమంది ఆన్‌లైన్‌లో ఈ కేన్సర్‌ గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నారని వివరించింది. 2022లో భారత్‌లో 1,23,907 గర్భాశయ కేన్సర్ కేసులు నమోదయ్యాయని, 77,348 మంది చనిపోయారని ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది.

More Telugu News