Anand Mahindra: అదే నిజమైతే ఈ జాబితా మార్చాల్సిందే: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra quest for what is toughest exam in India ends with UPSC Exam
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో మరోసారి తనదైన శైలిలో ఓ పోస్టు చేశారు. దేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏది అన్నదే ఆ పోస్టులో ప్రధాన టాపిక్. 

"ఇటీవల నేను 12th ఫెయిల్ అనే సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కుర్రకారుతో మాట్లాడాను. మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో అత్యంత కఠినమైన పరీక్ష ఏది? అని అడిగాను. నేను మాట్లాడిన వారిలో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నాడు. అతడు ఓ బిజినెస్ స్టార్టప్ ఏర్పాటులో పాలుపంచుకున్న వ్యక్తి. అతడు కూడా అత్యంత కఠినమైన పరీక్షగా యూపీఎస్సీ పరీక్షను పేర్కొన్నాడు. ఐఐటీ జేఈఈ కంటే యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా కష్టమైనదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అందరి అభిప్రాయం ఇదే అయితే... ఈ కింది జాబితాను వెంటనే మార్చాల్సిందే" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల వరల్డ్ ర్యాంకింగ్ జాబితాను కూడా రీట్వీట్ చేశారు. ఆ జాబితాలో చైనాకు చెందిన గావో కావో పరీక్ష అత్యంత కఠినమైన పరీక్షగా నెం.1 స్థానంలో  ఉంది. రెండో స్థానంలో ఐఐటీ జేఈఈ, మూడో స్థానంలో యూపీఎస్సీ ఉంది. 

ఆనంద్ మహీంద్రా సర్వే ప్రకారం ఈ జాబితాలో యూపీఎస్సీ ఎగ్జామ్ రెండో స్థానానికి, ఐఐటీ జేఈఈ పరీక్ష మూడో స్థానానికి మార్చాల్సి ఉంటుంది.
Go Back to Shorts
Anand Mahindra
Toughest Exam
UPSC
IIT JEE
India
12th Fail
Social Media

More Telugu News