K Kavitha: అన్నా..ప్రౌడ్ ఆఫ్ యూ..మెగాస్టార్ చిరుకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు

  • పద్మవిభూషణ్‌కు ఎంపికైన చిరంజీవికి ఎమ్మెల్సీ కవిత అభినందనలు
  • మెగాస్టార్‌కు బతుకమ్మ జ్ఞాపికను అందజేసిన వైనం
  • ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పిన కవిత
MLC Kavitha congratulates chiru for padmavibhushan award

ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్‌ను అభినందించిన కవిత, ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కూడా కవిత మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. మెగాస్టార్‌ను చూసి గర్వపడుతున్నానంటూ కామెంట్ చేశారు.

More Telugu News