Yogi Adityanath: దేశంలోనే అత్యంత పాప్యులర్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్!

  • 27.4 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లతో యోగి సరికొత్త రికార్డు
  • యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 
  • 95.1 మిలియన్ పాలోవర్లతో అగ్రస్థానంలో ప్రధాని మోదీ 
  • 34.4 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచిన అమిత్ షా
Yogi Adityanath becomes Indias most popular CM on X with 27 followers

భారత్‌లో ఇతర సీఎంలకంటే అధికంగా ‘ఎక్స్’ (ఒకప్పుడు ట్విట్టర్) ఫాలోవర్లను సొంతం చేసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యంత పాప్యులర్ సీఎంగా నిలిచారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తరువాతి స్థానంలో నిలిచారు. కేజ్రీవాల్ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. 24.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్న రాహుల్ గాంధీ కంటే కూడా యోగి ముందే ఉన్నారు. ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు 19.1 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. 

యోగి వ్యక్తిగత అకౌంట్‌తో పాటూ ఆయన వ్యక్తిగత ఆఫీస్ అకౌంట్‌ను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో అనుసరిస్తున్నారు. కోటి మందికి పైగా ఆఫీస్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. 

లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సీఎం యోగి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. చట్టాలను ఉల్లంఘించే వారిని ఆయన అస్సలు ఉపేక్షించరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరహా పాలనకు యోగి మోడల్ అని కూడా నామకరణం చేశాయి. మరోవైపు, రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో చేసిన ఏర్పాట్లపై కూడా సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. 

ఇక ట్విట్టర్ ఫాలోవర్ల పరంగా ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనను ఏకంగా 95.1 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. 34.4 మిలియన్ ఫాలోవర్లతో హోం మంత్రి అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు.

More Telugu News