ప్రధానమంత్రిని వాడు, వీడు అని అనడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం: విష్ణువర్ధన్ రెడ్డి
- ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో షర్మిల ధర్నా
- మాటల మధ్యలో మోదీ గాడు అంటూ పొరపాటున వ్యాఖ్యానించిన వైనం
- ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం
అయితే, షర్మిల వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. దేశ ప్రధానమంత్రి గారి పట్ల వాడు, వీడు అని అసభ్య పదజాలం వాడడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం అంటూ విమర్శించారు.
ఇలాంటి ఒక మహిళను పీసీసీ అధ్యక్షురాలిగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిగ్గుపడాలని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్వీట్ లో షర్మిల వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.