ప్రధానమంత్రిని వాడు, వీడు అని అనడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం: విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ధర్నా సందర్భంగా ఆమె తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటివరకు మోదీ గారు అంటూ వ్యాఖ్యలు చేసిన షర్మిల... రూ.46 లక్షల కోట్ల  బడ్జెట్ ప్రకటించినా, అందులో ఏపీకి ఏం చేశారు 'మోడీ గాడు' అంటూ పొరపాటున వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వెంటనే తప్పు గ్రహించి 'మోడీ గారు' అని పేర్కొన్నారు. 

అయితే, షర్మిల వ్యాఖ్యలను ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తప్పుబట్టారు. దేశ ప్రధానమంత్రి గారి పట్ల వాడు, వీడు అని అసభ్య పదజాలం వాడడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం అంటూ విమర్శించారు. 

ఇలాంటి ఒక మహిళను పీసీసీ అధ్యక్షురాలిగా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిగ్గుపడాలని విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్వీట్ లో షర్మిల వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్ ను కూడా పంచుకున్నారు.

Vishnu Vardhan Reddy
Sharmila
Narendra Modi
AP Special Status
New Delhi
BJP
Congress
Andhra Pradesh

More Telugu News