అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న భారత విద్యార్థులు.. నెల రోజుల వ్యవధిలో ఆరుగురి మృతి
- 2018 నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి
- ఒక్క కెనడాలోనే 91 మంది మృత్యువాత
- అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన 36 మంది విద్యార్థులు
- లోక్సభలో వెల్లడించిన కేంద్రం
2018 నుంచి ఇప్పటి వరకు విదేశాల్లో చదువుకుంటున్న 403 మంది విద్యార్థులు మరణించారు. అత్యధికంగా కెనడాలో 91 మంది మరణించగా, బ్రిటన్లో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్లో 21, జర్మనీలో 20 మంది మృతి చెందినట్టు నిన్న లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో సహజ మరణాలతోపాటు ప్రమాదాలు, వైద్య సంబంధిత మరణాలు కూడా ఉన్నట్టు వివరించింది.