తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్
- ఇటీవల ఐదో జాబితా ప్రకటించిన వైసీపీ
- నరసరావుపేట ఎంపీ స్థానానికి అనిల్ కుమార్ బదిలీ
- నేడు నెల్లూరు సిటీ ఇన్చార్జి నియామకంపై చర్చ
- ఇవాళ సీఎంవోకు వచ్చిన మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు
నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున మాజీ మంత్రి నారాయణ పోటీ చేసేది ఖాయం కాగా, అనిల్ కుమార్ స్థానంలో వైసీపీ తరఫున బరిలో దిగేది ఎవరన్నదానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
కాగా, నేడు సీఎంవోకు వచ్చిన వారిలో మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఉన్నారు.