Narendra Modi: నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందన

  • దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని
  • 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని
  • యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్న నరేంద్ర మోదీ
  • పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల నిధి ఏర్పాటు, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు చేస్తున్నట్లు వెల్లడి
PM Narendra Modi Shout Out For Interim Budget

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్‌కు మూలస్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అని కొనియాడారు.  

ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా యువతకు ఎన్నో కొత్త కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తాయని పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ఈ దిశగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందన్నారు.

More Telugu News