దూసుకుపోతున్న 'భామాకలాపం 2' టీజర్!

Bhamakalapam 2 movie update
  • ప్రియమణి నుంచి 'భామాకలాపం 2'
  • మరింత ఆసక్తిని పెంచిన టీజర్ 
  • పవర్ఫుల్ విలనిజాన్ని జోడించిన డైరెక్టర్ 
  • ఈ నెల 16వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్

ప్రియమణి ప్రధానమైన పాత్రను పోషించిన 'భామాకలాపం' సినిమా, ఆహా ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. ప్రియమణి - శరణ్య ప్రదీప్ పాత్రలను దర్శకుడు అభిమన్యు తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'భామా కలాపం 2' సిద్ధమైంది. 

బాపినీడు - సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమా నుంచి రీసెంటుగా టీజర్ ను రిలీజ్ చేశారు. ''అనుపమ అనే నేను ఇకపై పక్కింటివాళ్ల విషయాలను పట్టించుకోకుండా నా పనిని నేను ప్రశాంతంగా చేసుకుంటానని మాట ఇస్తున్నాను" అంటూ ప్రమాణ స్వీకారం తరహాలో భర్తతో అనుపమ చెబుతుంది.

అయినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదనే విషయం టీజర్ లోని మిగతా సన్నివేశాలను బట్టి అర్థమవుతోంది. ఈ సారి మరింత పవర్ఫుల్ విలనిజాన్ని జోడించారనే విషయం అర్థమవుతోంది. ఇప్పటికే 1మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టిన ఈ టీజర్, అదే రేంజ్ లో దూసుకుపోతోంది.  బ్రహ్మాజీ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Go Back to Shorts
Bhamakalapam 2
Priyamani
Sharanya Pradeep

More Telugu News