Suhas: రేపు థియేటర్ కి వస్తున్న సినిమాలివే!

  • రేపు విడుదలవుతున్న ఐదు సినిమాలు 
  • సుహాస్ సినిమాపై ఉన్న అంచనాలు 
  • 'ధీర'గా వస్తున్న లక్ష్ చదలవాడ 
  • 'బూట్ కట్ బాలరాజు'గా పలకరించనున్న సోహెల్ 
  • అదే లైన్లో ఉన్న 'హ్యాపీ ఎండింగ్' .. 'గేమ్ ఆన్' .. 'కిస్మత్' 

New Movies Update

ఈ వారం థియేటర్లకు ఐదు సినిమాలు వస్తున్నాయి.  ఈ ఆరు సినిమాలలో 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాకి మంచి బజ్ ఉంది. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాను ధీరజ్ నిర్మించగా, దుష్యంత్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి ఉంది. లక్ష చదలవాడ కథానాయకుడిగా నటించిన 'ధీర' సినిమాను పద్మావతి చదలవాడ నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కూడా కాస్త గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక సోహెల్ హీరోగా చేసిన 'బూట్ కట్ బాలరాజు' కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీ కొన్నేటి దర్శకత్వం వహించాడు. యశ్ పూరి కథానాయకుడిగా రూపొందిన 'హ్యాపీ ఎండింగ్' కూడా రేపే ఆడియన్స్ ను పలకరించనుంది. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించాడు. ఇక దయానంద్ దర్శకత్వంలో గీతానంద్ - నేహా సోలంకి జంటగా రూపొందిన 'గేమ్ ఆన్' .. క్రైమ్ కామెడీ నేపథ్యంలో నిర్మితమైన 'కిస్మత్' కూడా రేపు థియేటర్లకు రానున్నాయి. మరి ఈ సినిమాలలో ఏది ఎక్కువ వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News