Nirmala Sitharaman: రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్

  • ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్
  • పదిన్నర గంటలకు బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
  • లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్
Nirmala Sitharaman to present budget tomorrow

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుంటారు. అధికారులతో కలిసి అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు.

ఆ తర్వాత ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనానికి చేరుకుంటారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు కూడా చేరుకుంటారు. పదిన్నర గంటలకు కేంద్ర కేబినెట్ పార్లమెంట్ ఆవరణలో భేటీ కానుంది. మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది ఉదయం 11 గంటలకు నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

More Telugu News