YSRCP: వైసీపీ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల... వివరాలు ఇవిగో!

  • అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న వైసీపీ కసరత్తులు
  • ఇప్పటివరకు నాలుగు జాబితాల విడుదల
  • నేడు ఐదో జాబితా రిలీజ్ చేసిన మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల
YSRCP 5th list released

ఏపీ అధికార పక్షం వైసీపీ గత కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చుతూ నాలుగు జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ నేడు ఐదో జాబితా విడుదల చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐదో జాబితాను మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఈ జాబితాలో ఏడుగురు అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన లోక్ సభ, అసెంబ్లీ స్థానం వివరాలు ఉన్నాయి.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు ఎమ్మెల్యే స్థానం దక్కలేదు. ఆయనను వైసీపీ పెద్దలు నర్సరావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేశారు. 

ఇక, తిరుపతి సిట్టింగ్ ఎంపీ మద్దిల గురుమూర్తి తన స్థానాన్ని నిలుపుకున్నారు. గతంలో ఉప ఎన్నికలో గెలిచిన డాక్టర్ గురుమూర్తి ఈసారి కూడా తిరుపతి లోక్ సభ స్థానం నుంచే పోటీ చేయనున్నారు. తిరుపతి ఎస్సీ స్థానం కావడంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక, సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఎక్కడా స్థానం లభించలేదు. ఆయనకు తిరుపతి ఎంపీ స్థానం నుంచి అవకాశం ఇస్తామని వైసీపీ చెప్పినా, సత్యవేడును వదిలి వచ్చేందుకు ఆదిమూలం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు అటు సత్యవేడు, ఇటు తిరుపతి ఎంపీ స్థానం... రెండూ దక్కలేదు.

ఐదో జాబితా...

1. అరకు (ఎస్టీ)- రేగం మత్స్యలింగం
2. కాకినాడ (ఎంపీ)- చలమలశెట్టి సునీల్
3. మచిలీపట్నం (ఎంపీ)- సింహాద్రి రమేశ్ బాబు
4. అవనిగడ్డ- డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు
5. నర్సరావుపేట (ఎంపీ)- అనిల్ కుమార్ యాదవ్
6. సత్యవేడు (ఎస్సీ)- నూకతోటి రాజేశ్
7. తిరుపతి (ఎంపీ-ఎస్సీ)- మద్దిల గురుమూర్తి

More Telugu News