Sharwanand: శర్వానంద్ హీరోగా రొమాంటిక్ ఎంటర్టయినర్!

  • 'బాబ్' సినిమాతో బిజీగా శర్వానంద్ 
  • రామ్ అబ్బరాజుకి గ్రీన్ సిగ్నల్ 
  • ఇద్దరు హీరోయిన్స్ తో రొమాంటిక్ కంటెంట్
  • శర్వానంద్ జోడీగా సంయుక్త - సాక్షి వైద్య
Sharwanand in Ram Abbaraju Movie

ఆ మధ్య వరుస ఫ్లాపులు ఉక్కిరి బిక్కిరి చేయడంతో, శర్వానంద్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన శ్రీరామ్ ఆదిత్యకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి, ఆయన దర్శకత్వంలో 'బాబ్' అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవుతుండగానే శర్వానంద్ మరో ప్రాజెక్టును సెట్ చేసుకున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. 

శర్వానంద్ కి కథ వినిపించి ఓకే చేసుకున్న ఆ దర్శకుడు రామ్ అబ్బరాజు. క్రితం ఏడాది ఆయన నుంచి 'సామజవరగమన' సినిమా వచ్చింది. శ్రీవిష్ణు - రెబా మోనికా జాన్ జంటగా నటించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి వినోదభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది.  ఆ తరువాత ఆయన రెడీ చేసుకున్న కథ ఇదే. 

ఈ సినిమాను నిర్మించడానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు వచ్చినట్టుగా సమాచారం. ట్రయాంగిల్ లవ్ స్టోరీని కొత్త కోణంలో చూపించనున్నారని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే ఈ సినిమాలో కథానాయికలుగా సంయుక్త మీనన్ - సాక్షి వైద్య కనిపించనున్నారని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. 

More Telugu News