6 వేల పోస్టుల మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం
- నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం
- తొలుత టెట్ నిర్వహణ.. ఆపై డీఎస్సీ నిర్వహించే అవకాశం
- డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ
డీఎస్సీ 2024 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 6,100 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో చివరిసారి 2022 లో టెట్ నిర్వహించగా.. 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన వారు దాదాపుగా 2 లక్షల మంది ఉంటారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సుమారు 5 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు.