కాంగ్రెస్ నేతలపై డీజీపీ రవిగుప్తాకు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
- బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు
- బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ
- డీజీపీని కలిసిన వారిలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు
నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని... ఈ చర్యను తక్షణమే అడ్డుకోవాలని కోరారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలకకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, భాస్కర రావు, కోరుకంటి చందర్, భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తదితరులు డీజీపీని కలిశారు.