Vikarabad District: వికారాబాద్, పరిసర ప్రాంతాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త!

  • వికారాబాద్‌లో తాత్కాలికంగా నాలుగు రైళ్లను నిలపనున్నట్లు వెల్లడి
  • ముంబై-సీఎస్‌టీఎం-భువనేశ్వర్, రాజ్ కోట్-సికింద్రాబాద్ రైళ్లు ఆగుతాయని వెల్లడి
  • తిరుగు ప్రయాణంలో వికారాబాద్‌లో ఆగనున్నట్లు వెల్లడి
Good news for Vikarabad people

వికారాబాద్... పరిసర ప్రాంతాల వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వికారాబాద్‌లో నాలుగు రైళ్లను తాత్కాలికంగా నిలపనున్నట్లు ప్రకటించింది. ముంబై సీఎస్‌టీఎం-భువనేశ్వర్ (11019) రైలు ఉదయం 2.09 గంటలకు ఆగుతుంది. తిరిగి 2.10 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో వికారాబాద్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

రాజ్‌కోట్-సికింద్రాబాద్ (22717) రైలు ఉదయం 5.09 గంటలకు ఆగి... 5.10 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఆగుతుంది.
భువనేశ్వర్-సీఎస్‌టీఎం (11020) రైలు మధ్యాహ్నం 12.14 గంటలకు ఆగి... 12.15 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు ఫిబ్రవరి 2, 3, 14, 15 తేదీల్లో ఆగుతుంది. సికింద్రాబాద్ - రాజ్‌కోట్ (22718) రైలు మధ్యాహ్నం 3.59 గంటలకు స్టేషన్ వద్ద ఆగి... 4 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. ఈ రైలు 3, 4, 15, 16 తేదీల్లో తాత్కాలికంగా వికారాబాద్ స్టేషన్‌లో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

More Telugu News