Leopard: ఉత్తరాఖండ్‌లో ఆలయంలోకి ప్రవేశించిన చిరుత

  • నైనిటాల్‌లోని ప్రసిద్ధ గోరఖల్ ఆలయంలోకి ప్రవేశించిన చిరుత
  • తెల్లవారుజామున 3.40గంటల ప్రాంతంలో ఘటన
  • కాసేపు చక్కర్లు కొట్టి ఆలయాన్ని వీడిన చిరుత
Leopard Enters Ghorakhal Temple In Uttarakhand

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఉన్న ప్రసిద్ధ గోరఖల్ ఆలయంలోకి ప్రవేశించిన చిరుత తీరిగ్గా చక్కర్లు కొట్టింది. కాసేపటి తర్వాత ఆలయాన్ని వీడింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డు అయ్యింది. సోమవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ఆలయంలోకి చిరుత ప్రవేశించింది. ఆలయ కాంప్లెక్స్‌లో గేటులేని ప్రదేశం నుంచి లోపలికి వచ్చిన చిరుత ఆ తర్వాత తీరిగ్గా నడుస్తూ ఆలయంలో చక్కర్లు కొట్టింది. కాసేపు అక్కడే ఉండి ఆపై వచ్చిన దారినే వెళ్లిపోయింది. 

ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు దేశంలో తరచూ జరుగుతున్నాయి. ఈ నెల 21న హర్యానాలోని హిసార్ జిల్లాలో ఓ నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుత ఇద్దరు వ్యక్తులపై దాడిచేసింది. ఏడు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత దానిని బంధించగలిగారు.

More Telugu News