మమతా బెనర్జీ చెంపలు పగలగొట్టండి.. ప్రజలకు పిలుపునిచ్చిన బీజేపీ పశ్చిమ బెంగాల్ చీఫ్
- విద్యావ్యవస్థను మమత భ్రష్టు పట్టించారన్న సుకాంత మజుందార్
- పిల్లలు చదువులో రాణించలేకపోవడం వారి తప్పుకాదన్న బీజేపీ బెంగాల్ చీఫ్
- పిల్లల్ని కొట్టడానికి బదులు మమతను చెంపదెబ్బలు కొట్టాలని పిలుపు
మజుందార్ వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. భౌతికదాడులను ఆయన ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజుందార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు సిగ్గుచేటని టీఎంసీ నేత మహువా మెయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుకాంత వ్యాఖ్యలకు నిరసనగా టీఎంసీ మహిళా విభాగం నేడు (మంగళవారం) ర్యాలీ నిర్వహించనుంది.