తాలిబన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మీటింగ్.. పాల్గొన్న భారత్!
- పది దేశాల దౌత్యవేత్తలతో తాలిబన్‌ల ఆధ్వర్యంలో సోమవారం సమావేశం
- సమావేశానికి హాజరైన భారత్
- ఆప్ఘనిస్థాన్ వ్యవహారాల్లో భారత్ పూర్తి మద్దతు ఇస్తోందన్న తాలిబన్లు
కాగా, ఈ సమావేశానికి ముందు ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ ప్రభుత్వంతో శాంతి చర్చల్లో పాల్గొనాలని, తమ దేశంలోని అవకాశాలను వినియోగించుకోవాలని వివిధ దేశాలకు పిలుపునిచ్చింది. రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు వివిధ దేశాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొంది.
కాగా, మీటింగ్‌లో భారత్ పాల్గొనడంపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్ఘానిస్థాన్ వ్యవహారాలకు సంబంధించి భారత్ అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా క్రీయాశీలకంగా ఉందని పేర్కొన్నారు. ఆ దేశంలో అభివృద్ధికి, సుస్థిరతకు భారత్ మద్దతిస్తోందని వెల్లడించారు.