Manoj Bajpayee: ఇంట్రెస్టింగ్ సిరీస్ 'కిల్లర్ సూప్' .. ఆమె నటనే హైలైట్!

Killer Soup Special
  • నెట్ ఫ్లిక్స్ లో 'కిల్లర్ సూప్'
  • ప్రధాన పాత్రల్లో మనోజ్ బాజ్ పాయ్ - కొంకణా సేన్ శర్మ 
  • ఈ నెల 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన  

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో 'కిల్లర్ సూప్' ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా 'నెట్ ఫ్లిక్స్'లో అందుబాటులో ఉంది. మనోజ్ బాజ్ బాయ్ - కొంకణా సేన్ శర్మ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

మనోజ్ బాజ్ పాయ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సిరీస్ ఇది. సంపన్నుడైన జల్సా పురుషుడిగా .. ఒక కన్ను తేడా ఉన్న పేదవాడిగా ఆయన నటన కట్టిపడేస్తుంది. ఇక భర్తను హత్యచేసి ఆ ప్లేస్ లోకి అదే పోలికతో ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చి, తన ముచ్చట తీర్చుకునే పాత్రలో కొంకణా సేన్ చూపించిన నటన గొప్పగా అనిపిస్తుంది. 

తన భర్త హత్య విషయం బయటపడకుండా ఉండటం కోసం .. తన ప్రియుడి బండారం బయటపడకుండా ఉండటం కోసం నానా తంటాలు పడే పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఈ కథను ఆడియన్స్ కి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లడంలో ఆమె ప్రధానమైన పాత్రను పోషించింది. బలమైన సినిమా నేపథ్యం నుంచి రావడం, చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇవ్వడం ఆమె నటనలో సహజత్వానికి కారణమనుకోవాలి. 'రివ్యూ' కాలంలో ఈ సిరీస్ కథేమిటనేది తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News