Team India: అండర్-19 ప్రపంచకప్: ఒకే గ్రూపులో ఉన్నా భారత్-పాక్ జట్ల మధ్య పోరెందుకు లేదు?

  • అండర్-19 ప్రపంచకప్‌లో నేటి నుంచి సూపర్ సిక్స్ మ్యాచ్‌లు
  • సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన 12 జట్లు
  • చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ లేకపోవడంతో నిరాశలో అభిమానులు
  • తమకు భిన్నమైన స్థానాల్లో ఉన్న జట్లతోనే సూపర్ సిక్స్ పోటీ
  • గ్రూప్-ఎలో భారత్, గ్రూప్-డిలో పాక్
  • రెండూ తలపడకపోవడానికి కారణం అదే
Why India and Pakistan not facing each other in Under 19 world cup

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 2024 అండర్-19 ప్రపంచకప్‌లో నిన్న శ్రీలంకను ఆస్ట్రేలియా, యూఎస్ఏను భారత జట్టు ఓడించడంతో గ్రూప్ దశ ముగిసింది. ఇక సూపర్ సిక్స్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. గ్రూప్-ఎ నుంచి ఇండియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్.. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ అర్హత సాధించాయి. గ్రూప్-సిలో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా శ్రీలంక, జింబాబ్వే క్వాలిఫై అయ్యాయి. గ్రూప్-డి నుంచి పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్, నేపాల్ అర్హత సాధించాయి. సూపర్ సిక్స్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. అందులో విజయం సాధించిన వారు సెమీస్‌కు చేరుకుంటారు. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నప్పటికీ అవి రెండూ తలపడే అవకాశం లేకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. 

ఎందుకిలా? 
సూపర్ సిక్స్‌ మ్యాచ్‌లు ఎలా ఉంటాయంటే.. ఇందులోని ప్రతి జట్టు తమకు భిన్నమైన స్థానాల్లో నిలిచిన రెండు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారత్, పాక్ జట్లు రెండూ టాప్ ప్లేస్‌లో ఉండడంతో అవి ఒకదానితో ఒకటి తలపడే అవకాశం లేదు. కాబట్టి ఇది భారత్-పాక్ అభిమానులకు నిరాశ కలిగించే వార్తే.

More Telugu News