AP High Court: కోర్టును ఆశ్రయించిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు... విచారణ వాయిదా

  • వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
  • అనర్హత వేటు ఎందుకు వేయకూడదంటూ నోటీసుల్లో పేర్కొన్న స్పీకర్
  • లంచ్ మోషన్ పిటిషన్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు
  • వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం
  • కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు
Court adjourns YCP MLAs lunch motion petition

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మీపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదు అంటూ స్పీకర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

ఈ నోటీసులపై నలుగురు ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అటు, మండలి చైర్మన్ కూడా ఇదే తరహా అనర్హత వేటుపై ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకు నోటీసులు పంపారు. ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు. 

ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది.

More Telugu News