Janhvi Kapoor: సూర్య జోడీగా జాన్వీ కపూర్ .. కోలీవుడ్ ఎంట్రీ!

  • 'దేవర' షూటింగులో ఉన్న జాన్వీ 
  • కోలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు
  • సూర్య హీరోగా రూపొందే పాన్ ఇండియా మూవీ  
  • దర్శకత్వం వహించనున్న ఓం ప్రకాశ్

Janhvi Kapoor on Surya Movie

జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తెలుగు తెరపై ఆమెను చూడటానికి ఇక్కడి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె 'దేవర' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. ఫస్టులుక్ తోనే కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టడం జరిగిపోయింది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతూ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాశ్ తమిళంలో సూర్య హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆల్రెడీ కథా చర్చలు ముగిశాయని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీని ఎంపిక చేయడం జరిగిపోయిందనే ఒక టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. 

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచన ఉండటం వలన, కథానాయికగా జాన్వీని తీసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం సూర్య 'కంగువా' సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన ఈ ప్రాజెక్టుతోనే సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. మొత్తానికి కోలీవుడ్ ఎంట్రీ కూడా గట్టిగానే ఉండేలా జాన్వీ ప్లాన్ చేసుకుందన్న మాట.

More Telugu News