Stock Market: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా 1,241 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

  • మార్కెట్లను ముందుండి నడిపించిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ తదితర హెవీ వెయిట్ కంపెనీలు
  • 385 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన ఇన్ఫ్రా సూచీ
Sensex gains 1241 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రాకెట్ లా దూసుకుపోయాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆకాశమే హద్దుగా కొనసాగాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్టీ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ కంపెనీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు లేకపోవడం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా వస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,241 పాయింట్లు లాభపడి 71,942కి చేరుకుంది. నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 21,738కి ఎగబాకింది. 

ఒక సెషన్లో సూచీలు ఈ రేంజ్ లో లాభపడటం గత రెండు నెలల్లో ఇదే తొలిసారి. ఎనర్జీ సూచీ 5 శాతానికి పైగా లాభపడగా... ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్ఫ్రా సూచీలు 4 శాతానికి పైగా పెరిగాయి. టెక్, ఐటీ సూచీలు మాత్రం నిరాశ పరిచాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (6.86%), టాటా మోటార్స్ (3.62%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.40%), ఎల్ అండ్ టీ (3.22%), కోటక్ బ్యాంక్ (3.18%). 

టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.20%), ఇన్ఫోసిస్ (-0.89%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.59%), టెక్ మహీంద్రా (-0.53%), టీసీఎస్ (-0.18%).

మరోవైపు అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మరో 3 పైసలు బలహీనపడింది. యూఎస్ డాలర్ తో పోలిస్తే మన కరెన్సీ విలువ రూ. 83.14కి పడిపోయింది.

More Telugu News