రేవంత్ ను కలిసిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- రేవంత్ తో భేటీ అయిన ప్రకాశ్ గౌడ్
- గతంలో టీడీపీలో కలిసి పని చేసిన రేవంత్, ప్రకాశ్
- మర్యాదపూర్వకంగానే కలిశానంటున్న ప్రకాశ్ గౌడ్
ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ను ప్రకాశ్ గౌడ్ కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ప్రకాశ్ గౌడ్ కలిశారు. అయితే తాను మర్యాదపూర్వకంగానే పొన్నం ప్రభాకర్ ను కలిశానని ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
రేవంత్ రెడ్డిని కలవడంపై ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ... మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలపై రేవంత్ తో మాట్లాడానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని తాను కోరగా... రేవంత్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.