Kodandaram: విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరాం.. మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో సీఎం రేవంత్!

  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోదండరాం భేషరతు మద్దతు
  • ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి
  • బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ!
MLC Kodandaram to become Telangana education minister

ఎమ్మెల్సీగా నామినేట్ అయిన టీజేఎస్ చీఫ్ కోదండరాం మంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోదండరాం ప్రొఫెసర్ కావడంతో ఆయనకు కీలకమైన విద్యాశాఖను అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్‌ను విస్తరించే యోచనలో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ నెలాఖరులోగానే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తిచేసి అధిష్ఠానం నిర్ణయం కోసం పంపనున్నట్టు తెలిసింది. 

కేబినెట్‌లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మాత్రమే ఉన్నారు. విస్తరణలో మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భేషరతు మద్దతు ప్రకటించిన కోదందరాంకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీచేసిన కాంగ్రెస్ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

More Telugu News