Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

"నా సీటు కింద బాంబు ఉంది" అంటూ ఇండిగో విమానంలో ప్రయాణికుడి కలకలం

Indigo plane delayed after a passenger said bomb under my seat
Advertisement
  • ఇటీవల తరచుగా వార్తల్లోకెక్కుతున్న ఇండిగో విమానాలు
  • ముంబయి నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం
  • ప్రయాణికుడు బాంబు ఉందని చెప్పడంతో విమానంలో తనిఖీలు
  • ఎలాంటి బాంబు లేదన్న పోలీసులు... ప్రయాణికుడి అరెస్ట్
Advertisement
ఇటీవల కాలంలో ఇండిగో విమానాలు ఏదో ఒక కారణంతో తరచుగా వార్తల్లోకెక్కుతున్నాయి. తాజాగా మరో ఘటన జరిగింది. గత అర్ధరాత్రి ముంబయి నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అయింది. విమానంలో ఓ ప్రయాణికుడు సృష్టించిన కలకలమే అందుకు కారణం. 

"నా సీటు కింద బాంబు ఉంది" అంటూ అతడు చెప్పేసరికి అందరూ అదిరిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న ముంబయి విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు ఇండిగో విమానాన్ని అణువణువు తనిఖీ చేశారు. చివరికి బాంబు ఏమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని ముంబయి పోలీసులు వెల్లడించారు. 

ఈ ఘటనపై సెక్షన్ 506(2), సెక్షన్ 505(1) (B) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు... 27 ఏళ్ల ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు అలా చెప్పాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement
Indigo
Bomb
Passsenger
Mumbai
Lucknow
Police

More Telugu News