Chandrababu: ఈరోజు చంద్రబాబు, షర్మిల ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారంటే..!

Chandrababu and YS Sharmila today schedule
  • ఈరోజు పీలేరు, ఉరవకొండ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు
  • బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న షర్మిల
  • భీమిలి సభలో పాల్గొననున్న జగన్
ఏపీలో ప్రధాన పార్టీల నేతల వరుస సభలు, కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 'రా.. కదలిరా' పేరుతో బహింరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఈరోజు భీమిలిలో 'సిద్ధం' సభకు హాజరవుతున్నారు. దీంతో, రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన ఆయన 11.15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు హెలికాప్టర్ లో పీలేరుకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఉరవకొండకు చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుగుపయనమవుతారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు. కేత్ర స్థాయిలో ఆమె పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసే పనిలో ఉన్నారు.
Chandrababu
Telugudesam
YS Sharmila
Congress
Jagan
YSRCP
AP Politics

More Telugu News