సికింద్రాబాద్లోని పీజీ హాస్టల్లోకి చొరబడిన దుండగుడు.. పట్టుకుని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు
- కిటికీలోంచి లోపలికి చొరబడిన యువకుడు
- సైగ చేయడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు
- హాస్టల్లో రక్షణ కరవైందంటూ అమ్మాయిల ధర్నా
దుండగుడు తమను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడని విద్యార్థులు పేర్కొన్నారు. హాస్టల్లో తమకు రక్షణ కరవైందని, వెంటనే సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.