Narendra Modi: సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి భారత ప్రధానిగా ఉన్నారు: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

  • భారత్ అమలు చేస్తోన్న విదేశీ విధానాలు అసాధారణమన్న పుతిన్
  • భారత్ దూసుకెళ్లడానికి ప్రధాన కారణం మోదీ వంటి దృఢమైన నాయకత్వం ఉండటమేనని వ్యాఖ్య
  • మేకిన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చిందన్న పుతిన్ 
Putin again heaps praise on PM Modi

భారత ప్రధాని నరేంద్రమోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అమలు పరుస్తోన్న విదేశీ విధానాలు అసాధారణమన్నారు. అన్ని రంగాల్లో భారత్ దూసుకు వెళ్లడానికి ప్రధాన కారణం నరేంద్రమోదీ వంటి దృఢమైన నాయకత్వం ఉండటమే కారణమన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశం భారత్ అన్నారు. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి భారత ప్రధానిగా ఉన్నారని ప్రశంసించారు.

ప్రధాని నాయకత్వ పటిమవల్లే భారత్ ఈ రోజు మనం చూస్తున్న వృద్ధిలోకి వచ్చిందన్నారు. భారత్ ఎప్పుడూ ప్రపంచ వేదికలపై రష్యా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదని గుర్తు చేశారు. రష్యాపై ఇప్పటి వరకు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించలేదన్నారు. అందుకే ఆ దేశం పట్ల... నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన మేకిన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోందన్నారు. భారత్‍కు అత్యంత ఎక్కువ పెట్టుబడులు రష్యా నుంచి వెళుతున్నాయన్నారు. ఇప్పటికే దాదాపు 23 బిలియన్ డాలర్లను భారత్‌లో రష్యా కంపెనీలు ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపారు.

More Telugu News