Nara Bhuvaneswari: అధైర్యపడొద్దు... పార్టీ మీ వెన్నంటే ఉంది: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

  • గతేడాది స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం పలువురు కార్యకర్తల మృతి
  • 'నిజం గెలవాలి' పేరిట కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి
Nara Bhuvaneswari visits deceased TDP workers families

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యాక మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. నేటి పర్యటనలో పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. 

మొదటగా పి.గన్నవరం నియోజకవర్గం, ఐనవల్లి మండలం, ఎస్.మూలపాలెం గ్రామంలో పార్టీ కార్యకర్త మోరెంపూడి మీరాసాహెబ్ కుటుంబాన్ని పరామర్శించారు. మీరాసాహెబ్ (52) 2023 అక్టోబరు 25న గుండెపోటుతో మృతిచెందారు. మీరాసాహెబ్ భార్య దుర్గమ్మ, తమ్ముడు బాలరాజును భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. 

అనంతరం అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం, చల్లపల్లి గ్రామంలో సాలాది విశ్వనాథం కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. విశ్వనాథం(58) 2023 అక్టోబరు 20న గుండెపోటుతో మృతిచెందారు. విశ్వనాథం భార్య ఆదిలక్ష్మి, కుమార్తెలు జీవనజ్యోతి, రత్నకుమారి, కాంతలక్ష్మిలను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి రూ.3 లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. 

అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలం, రెల్లుగడ్డ గ్రామంలో కార్యకర్త నడింపల్లి పల్లంరాజు కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించారు. పల్లంరాజు(77), 2023 అక్టోబరు 1న గుండెపోటుతో మృతిచెందారు. పల్లంరాజు భార్య అన్నపూర్ణ, కొడుకు వెంకటరాజు, కుమార్తె దుర్గలను భువనేశ్వరి ఓదార్చారు. రూ.3 లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేశారు. 

అనంతరం రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం, విశ్వేశ్వరాయపురం గ్రామంలో పార్టీ కార్యకర్త చెల్లుబోయిన నరసింహారావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. నరసింహారావు(57), 2023 సెప్టెంబరు 9న గుండెపోటుతో మృతిచెందారు. నరసింహారావు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు చంద్రకాంత్ లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు. 

ఆపై, రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త సరెళ్ల పెద్దిరాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. పెద్దిరాజు(57), 2023 అక్టోబరు 17న గుండెపోటుతో మృతిచెందారు. పెద్దిరాజు కుమారుడు రాంబాబు, కోడలు నాగలక్ష్మి, మనుమరాలు జాస్మిన్ లను భువనేశ్వరి పరామర్శించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. 

ఆ తర్వాత మండపేట నియోజకవర్గం, కపిలేశ్వరపురం మండలం, నల్లూరు గ్రామంలో పార్టీ కార్యకర్త జొన్నకూటి రాజు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. రాజు కుమార్తె అన్నపూర్ణ, కుమారుడు విజయ్ కుమార్ లను భువనేశ్వరి పరామర్శించి, ఓదార్చారు. రూ.3 లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేశారు. 

చివరిగా మండపేట నియోజకవర్గం, మండపేట మండలం, పాలతోడు గ్రామంలో మందపల్లి ధర్మరాజు కుటుంబాన్ని పరామర్శించారు. ధర్మరాజు(51) 2023  సెప్టెంబరు 9న గుండెపోటుతో మృతిచెందారు. ధర్మరాజు భార్య మందపల్లి జ్యోతి, కుమార్తెలు వినీల, ప్రమీల, కుమారుడు వరుణ్ లను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం చేసి ధైర్యం చెప్పారు. 

అధైర్యపడొద్దు... పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా ఇచ్చారు. పరామర్శల అనంతరం అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బలభద్రపురం గ్రామంలో బస చేశారు.

More Telugu News