YS Sharmila: వీటిలో ఏది జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల

  • ఏలూరులో షర్మిల మీడియా సమావేశం
  • ఏపీకి విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమలవుతాయని వెల్లడి
  • మళ్లీ టీడీపీ గానీ, వైసీపీ గానీ వస్తే జన్మలో ప్రత్యేక హోదా రాదని వ్యాఖ్యలు
Sharmila says only Congress party will give special status to AP

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏపీకి విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఏపీలో పొరపాటున మళ్లీ టీడీపీ గానీ, వైసీపీ గానీ అధికారంలోకి వస్తే జన్మలో ప్రత్యేక హోదా రాదని అన్నారు. 

"కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుంది. ఎందుకంటే... రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపైనే పెడతారు. అందుకే, ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, మనకు రాజధాని కావాలన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ ను గెలిపించడం కోసం మనందరం శక్తివంచన లేకుండా పనిచేద్దాం" అని షర్మిల పిలుపునిచ్చారు.

More Telugu News