అసోంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ
- అసోంలో భారత్ జోడో న్యాయ యాత్ర..రాహుల్ గాంధీపై కేసు
- కేసును సీఐడీకి బదిలీ చేసేందుకు రాష్ట్ర పోలీసుల నిర్ణయం
- దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేయనున్న సీఐడీ
ఇదిలా ఉంటే.. లోక్సభ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ అరెస్టవుతారని అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ అన్నారు. సిబ్సాగర్ జిల్లాలోని నజీరాలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిమంత మాట్లాడారు. హింసాత్మక ఘటనపై కేసుకు సంబంధించి లోక్సభ ఎన్నికల తరువాత రాహుల్ అరెస్టు అవుతారని చెప్పారు.