ఇకపై జగన్ కుటుంబ సభ్యులకు కూడా భారీ భద్రత.. విదేశాల్లో ఉన్న కూతుళ్లకు కూడా!
- స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ 2023 యాక్ట్ కు గవర్నర్ ఆమోదముద్ర
- ముఖ్యమంత్రి, భార్య / భర్త, తల్లిదండ్రులు, పిల్లలకు పూర్తిస్థాయి భద్రత
- విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత
స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ముఖ్యమంత్రి, భార్య / భర్త, తల్లిదండ్రులు, పిల్లలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారు. సీఎం నివాసం వద్ద, రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల్లో ప్రయాణించేటప్పుడు, నడక సమయంలో వారికి భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం జగన్ కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు. ఈ చట్టం ప్రకారం విదేశాల్లో ఉన్న జగన్ కుమార్తెలు ఇద్దరికీ అక్కడ భద్రతను కల్పిస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తుంది.