Jharkhand High Court: వృద్ధాప్యంలో ఉన్న అత్తను కోడలే చూసుకోవాలి.. అది మన సంస్కృతిలోనే ఉంది: ఝార్ఖండ్ హైకోర్టు

  • విడాకుల కేసులో హైకోర్టు కీలక తీర్పు
  • వృద్ధులైన అత్తమామల నుంచి విడిపోవాలని ఒత్తిడి తేవడం సరికాదని వ్యాఖ్య
  • ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోతే మనోవర్తి పొందే హక్కు ఉండదన్న న్యాయస్థానం
Obligatory on wifes part to serve husbands mother says Jharkhand High Court

వృద్ధాప్యంలో ఉన్న అత్త  సంరక్షణపై ఝార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సింది కోడలేనని, అది మన సంస్కృతీ సంప్రదాయాల్లోనే ఉందని పేర్కొంది. ఓ విడాకుల కేసు సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులైన అత్తమామలు, లేదా భర్త నాయనమ్మకు సేవ చేయడం స్త్రీ బాధ్యత అని పేర్కొంది. అదొక సాంస్కృతిక ధర్మమని తెలిపింది. వారి నుంచి విడిపోయి వేరుగా కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ సుభాష్‌చంద్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోయినట్టయితే మనోవర్తి పొందేహక్కు భార్యకు ఉండదని పేర్కొన్నారు. 

విడాకుల కేసును విచారించిన దుమ్కాలోని కుటుంబ న్యాయస్థానం భార్యకు రూ.30 వేలు, కుమారుడికి రూ. 15 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. భర్త దీనిని ఝార్ఖండ్ హైకోర్టులో సవాలు చేశాడు. దీనిని విచారించిన న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది. అంతేకాదు, ఈ సందర్భంగా కుటుంబంలోని మహిళ ప్రాముఖ్యాన్ని చెబుతూ మనుస్మృతిలోని విషయాలను ప్రస్తావించడం గమనార్హం.

More Telugu News