YS Jagan: ఈ నెల 27 నుంచి ఏపీ సీఎం జిల్లాల పర్యటన

AP cm jagan to tour districts ahead of elections
  • మొత్తం 26 జిల్లాలకు కలిపి ఐదు బహిరంగ సభల ఏర్పాటు
  • భీమిలిలో తొలి బహిరంగ సభ ఏర్పాటు
  • ఫిబ్రవరి 10లోపు అన్ని సభలు పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారైనట్టు పార్టీ వర్గాల వెల్లడి 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటూ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తారు. కొన్ని జిల్లాలకు కలిపి ఒకే చోట బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అనంతరం జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశమయ్యేలా జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారు చేశారు. 

ఈ నెల 27న ఉత్తరాంధ్రలోని భీమిలిలో తొలి బహిరంగ సభ జరుగుతుంది. మొత్తం 26 జిల్లాలకు కలిపి అయిదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 10లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
YS Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News