G. Kishan Reddy: గోల్కొండ కోట చరిత్ర తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షో... కార్యక్రమంలో కిషన్ రెడ్డి, చిరంజీవి

Facade Illumination and Light and Sound Show at Golconda Fort
  • సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • ముఖ్య అతిథులుగా హాజరైన చిరంజీవి, విజయేంద్రప్రసాద్
  • సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో లైట్ షో ఏర్పాటు
హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద ఈ కోట చరిత్ర తెలిసేలా కేంద్ర ప్రభుత్వం సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో లైట్ షోను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మోదీ ప్రధాని అయ్యాక రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. అలాగే వేయి స్తంభాల గుడిని పునర్ నిర్మిస్తున్నామన్నారు. వరంగల్ కోటలోను ఇలాంటి సౌండ్ అండ్ లైట్ షో కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం, జోగులాంబ అమ్మవారి దేవాలయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. సమ్మక్క సారక్క జాతరకు కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. ఇక్కడి గిరిజన యూనివర్సిటీకి సమ్మక్క సారక్క అని పేరు పెట్టుకున్నామని గుర్తుచేశారు. మోదీ హయాంలో మన కళలు, సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
G. Kishan Reddy
Chiranjeevi
Hyderabad
golkonda fort

More Telugu News