నమ్రత బర్త్‌డే పార్టీలో తళుక్కుమన్న నారా బ్రాహ్మణి

  • జనవరి 22న నమ్రత పుట్టినరోజు వేడుక
  • పార్టీకి హాజరైన నారా బ్రాహ్మణి, మహేశ్ బాబు సిస్టర్స్, స్నేహ రెడ్డి
  • అతిథులతో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట షేర్ చేసిన నమ్రత
మాజీ మిస్ ఇండియా, సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు వేడుకల్లో నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సందడి చేశారు. జనవరి 22న జరిగిన ఈ వేడుకలో బ్రాహ్మణి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. బ్రాహ్మణితో పాటూ ఈ పార్టీలో మహేశ్ బాబు సిస్టర్స్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, పలువురు ఫ్యాషన్ డిజైనర్లు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి దిగిన ఫొటోలను నమ్రత నెట్టింట షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌ అవుతున్నాయి. 

ఇక, జర్మనీలో ఉన్న మహేశ్ కూడా తన భార్య నమ్రతకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Namrata Shirodkar
Nara Brahmani
Mahesh Babu
Tollywood

More Telugu News