జనసేనలో చేరిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
- పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిక
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని
- కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న జానీ మాస్టర్
నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ కొన్నిరోజులుగా అక్కడే ఉండి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే సమయంలో ఆయన నేడు జనసేనలో చేరారు.