Jailer 2: 'జైలర్ 2' నుంచి నయనతారకు పిలుపు?

  • బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'జైలర్'
  • సీక్వెల్ దిశగా మొదలైన సన్నాహాలు 
  • తెరపైకి వచ్చిన నయనతార పేరు
  • భారీ పారితోషికం అందుకుంటున్న నెల్సన్

Nayanatara in jailer 2 Movie

రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' సినిమాను రూపొందించాడు. క్రితం ఏడాది ఆగస్టు 10వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోని విజయ విహారం చేసింది. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో తమన్నా ఒక పాటలో మెరిసింది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ కి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. 

ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను రజనీకి వినిపించి నెల్సన్ ఓకే చెప్పించుకున్నాడనే వార్త కొన్ని రోజుల క్రితమే షికారు చేసింది. ఇప్పుడు ఈ సినిమా కోసం నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఆ పాత్రకి ఆమె దాదాపు ఖాయమైనట్టేనని అంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ నాలుగైదు సినిమాలు వచ్చాయి. మరోసారి  'జైలర్ 2' కోసం కలిసి కనిపించనున్నట్టు తెలుస్తోంది.

'జైలర్' సినిమాలో రజనీకి భార్య పాత్రలో రమ్యకృష్ణ కనిపించింది. ఒకవేళ నయనతారను సంప్రదించడం నిజమే అయితే, ఆమె ఏ పాత్రలో కనిపించనుందనే ఆసక్తి ఆడియన్స్ లో అప్పుడే మొదలైపోయింది. నయనతార మాత్రమే కాదు, ఈ సినిమా కోసం నెల్సన్ అందుకునే పారితోషికం కూడా గట్టిగానే ఉందని అంటున్నారు.

More Telugu News