నేటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర కొనసాగింపు
- చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరణించినవారి కుటుంబాలకు పరామర్శ
- తాజాగా మూడ్రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన
- మృతుల కుటుంబాలకు పరామర్శ... ఆర్థికసాయం
నేడు జగ్గంపేట, పెద్దాపురం, తుని, కాకినాడలో పర్యటించనున్నారు. రేపు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. ఎల్లుండి అనపర్తి నిడదవోలు, కొవ్వూరు, రాజానగరంలో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిస్తారు.