Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... వీడియో ఇదిగో

Four BRS MLAs meets CM Revanth Reddy
  • సీఎంను కలిసిన సునీతా, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహీపాల్ రెడ్డి, మాణిక్ రావు
  • ముఖ్యమంత్రి నివాసంలో కలిసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు
  • మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలను వారు ముఖ్యమంత్రికి విన్నవించారని తెలుస్తోంది.
Revanth Reddy
Sunitha Laxma Reddy
BRS
Congress

More Telugu News