Mukesh Ambani: అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించిన ముఖేశ్ అంబానీ

Mukesh Ambani family announced huge donation to Ayodhya Ramjanmabhoomi Trust
  • రూ.2.51 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ
  • అయోధ్య రామమందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నమని వ్యాఖ్య
  • సోమవారం కుటుంబ సమేతంగా ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొన్న ముఖేశ్ అంబానీ
అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు విరాళాల పర్వం కొనసాగుతోంది. సోమవారం బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబం రూ.2.51 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. రామజన్మభూమి ట్రస్ట్‌కు ఈ పెద్ద మొత్తాన్ని ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ. 2.51 కోట్లు విరాళంగా అందించారు. సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగివున్న అయోధ్య రామ మందిర అభివృద్ధికి పవిత్ర ప్రయత్నం" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖేష్ అంబానీ, భార్య నీతా, కుమారులు ఆకాశ్, అనంత్, కోడలు శ్లోకా మెహతాతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్, కుమార్తె ఇషా, అల్లుడు ఆనంద్ పిరమాల్ పాల్గొన్నారు. అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన ప్రముఖ వ్యక్తుల్లో వీరు కూడా ఉన్నారు.

ఈరోజు రాముడు విచ్చేస్తున్నాడని దేశం మొత్తం ‘రామ్ దీపావళి’ని జరుపుకుంటోందని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ అన్నారు. జనవరి 22న దేశం మొత్తానికి రామ్ దీపావళి వ్యాఖ్యానించారు. ఇక ఇది చారిత్రాత్మకమైన రోజు అని నీతా అంబానీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Mukesh Ambani
Mukesh Ambani family
Ayodhya Ramjanmabhoomi Trust
Ayodhya Ram Mandir
Ayodhya Ram Temple

More Telugu News