KTR: అర్జున్ రెడ్డి స్టైల్లో కేటీఆర్.. ఫొటోను షేర్ చేసిన కేటీఆర్!

  • ఎప్పుడూ క్లీన్ షేవ్ లో కనిపించే కేటీఆర్
  • ఏఐ టెక్నాలజీతో కేటీఆర్ లుక్ మార్చిన అభిమాని
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
KTR in Arjun Reddy look

బీఆర్ఎస్ అగ్రనేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడూ క్లీన్ షేవ్ లోనే కనిపిస్తుంటారు. హెయిర్ స్టయిల్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. మరోవైపు అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ లుక్ ను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. విజయ్ లుక్ లో కేటీఆర్ కనిపిస్తే ఎలా ఉంటుంది? తాజాగా ఏఐ టెక్నాలజీతో అర్జున్ రెడ్డి లుక్ లో కేటీఆర్ ఫొటోను ఒక అభిమాని రూపొందించారు. పొడవాటి జుట్టు, గడ్డంతో ఉన్న కేటీఆర్ ఫొటోను సదరు అభిమాని కేటీఆర్ కు పంపించాడు. 

ఈ ఫొటోను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. బీఆర్ఎస్ ను అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసిన తన ఫొటోను షేర్ చేస్తున్నానని కేటీఆర్ తెలిపారు. తాను జుట్టు, గడ్డం పెంచుకుంటే ఇలా ఉంటానని అన్నారు. దీనికి నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

More Telugu News