Narendra Modi: రామాలయ నిర్మాణంతో మన పని పూర్తి కాలేదు: ప్రధాని మోదీ

  • 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర
  • అయోధ్యలో నేడు రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన
  • బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాల్సి ఉందన్న మోదీ
  • సర్వ శక్తులు కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని పిలుపు
Modi says not enough with Ram Mandir in Ayodhya

శతాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో బాల రాముడు కొలువైన చారిత్రక ఘట్టం పూర్తయింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదని అన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాల్సి ఉందని స్పష్టం చేశారు. సర్వ శక్తులు కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. దేవ్ సే దేశ్... రామ్ సే రాష్ట్ర్... ఇదే మన కొత్త నినాదం అని పేర్కొన్నారు. దేశ సర్వోన్నత అభివృద్ధికి అయోధ్య రామ మందిరం చిహ్నం కావాలని అభిలషించారు. కాగా, అయోధ్య రామ మందిరం నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని సన్మానించారు. కార్మికులపై పూలు చల్లి నమస్కరించారు.

More Telugu News